సావరిన్ గోల్డ్ బాండ్స్
* ఈ సువర్ణావకాశం కేవలం నవంబర్ 21,
2015 వరకు మాత్రమే *
త్వరపడండి
మన భారత ప్రభుత్వం
సావరిన్ గోల్డ్ బాండ్ లను భారత ప్రజలందరికీ అందించాలని నిర్ణయించిన సంగతి
మీకందరికీ విదితమే. మన ప్రియతమ ప్రధాన
మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే 05-11-2015 వ తేదిన ప్రారంభ మైన సావరిన్ గోల్డ్ బాండ్స్ పథకం
కరీంనగర్ పోస్టల్ డివిజన్ లోని కరీంనగర్ మరియు జగిత్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్ లలో,
సిరిసిల్ల మరియు వేములవాడ సబ్ పోస్ట్ ఆఫీస్ లలో సోమవారం నుండి ప్రారంభిచబడుతుంది.
ఈ పథకం యొక్క ప్రధానాంశాలు.
1.
ఈ పసిడి బాండ్ లను భారతీయ పౌరసత్వం కలిగిన
వారందరు ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీస్ లలో కనిష్ఠంగా 2
గ్రాముల
నుండి గరిష్ఠంగా 500 గ్రాముల వరకు తీసుకోవచ్చును.
2.
ఈ యొక్క బాండ్ కొరకు నవంబర్ 21, 2015 లోపు ముందస్తు బుకింగ్ చేసుకోవలెను. నవంబర్ 26, 2015 నుండి బాండ్ లు ఇవ్వబడుతాయి.
3.
బాండ్ యొక్క ధర క్రితం వారములో ఇండియన్ బుల్లియన్
& జువెల్లెర్స్ అసోసియేషన్ నిర్ణయించిన 999 స్వచ్చ
బంగారం ధర యొక్క సగటుని ప్రామాణికముగా తీసుకొని
నిర్ణయిస్తారు.
4.
ఈ బాండ్ యొక్క కాల పరిమితి 8 సంవత్సరములు.
5 సంవత్సరముల తరువాత మాచ్యురిటి అవకముందే తీసుకునే
అవకాశం కలదు.
5.
మాచ్యురిటి/రిడెంప్షన్ సమయములో ఇండియన్ బుల్లియన్
& జువెల్లెర్స్ అసోసియేషన్ నిర్ణయించిన బంగారం ధర
ప్రకారం సొమ్ము తిరిగి చెల్లించబడుతుంది.
6. ఈ యొక్క బాండ్ కి సంవత్సరానికి గాను 2.75% వడ్డీ ప్రతి ఆరు నెలలకు చెల్లించబడుతుంది.
సదా మీ సేవలో…! జి. శ్రీనివాస మూర్తి
సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్
కరీంనగర్ డివిజన్ - 505001
0 comments:
Post a Comment