Press Note Dated 17.03.2016
కరీంనగర్ పోస్టల్ డివిజన్
సుకన్య సమ్రిద్ధి యోజన పక్షోత్సవాలలో భాగంగా
కరీంనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో జరిగిన ప్రారంభోత్సవ సభలో జిల్లా
కలెక్టర్ శ్రీమతి. నీతూ కుమారి ప్రసాద్ గారు పాల్గొన్నారు. మార్చి 17 నుండి
మార్చి 31 వరకు వరకు 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను ప్రారంభించిన కలెక్టర్
గారు, సుకన్య సమ్రిద్ధి యోజన లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులను
సన్మానించారు. ఈ సందర్భముగా మాట్లాడుతూ కేవలం ఒక సంవత్సర కాలంలో కరీంనగర్ డివిజన్
పరిధి లో 45000 సుకన్య అకౌంట్లు మరియు కరీంనగర్ జిల్లా పరిధిలో 58000
ఖాతాలు
ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ ఖాతాలో జమ చేసిన నగదు అమ్మాయిల పెళ్లి మరియు
చదువుల సమయములో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. 10 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడపిల్లలు
ఎవరైనా ఇంకా ఈ ఖాతాను తెరవని యెడల వెంటనే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో ఈ ఖాతాను
తెరవాల్సిందిగా కోరారు. కార్యక్రమములో పోస్టల్ సూపరింటెండెంట్ జి. శ్రీనివాస
మూర్తి , అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి.రామకృష్ణ, పోస్ట్ మాస్టర్ నరసింహ స్వామి, ఇతర
పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment